రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ ఫేస్ మాస్క్‌తో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రముఖ తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని, సంజరు దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.