వినూత్నంగా శ్మశానంలో టీజర్‌ రిలీజ్‌

వినూత్నంగా శ్మశానంలో టీజర్‌ రిలీజ్‌అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న హర్రర్‌ ఎంటర్‌టైనర్‌ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమాస్‌ బ్యానర్స్‌పై కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈనెల 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నారు. ‘గీతాంజలి’ కంటే రెట్టింపు వినోదంతోనే కాకుండా అందర్నీ భయపెట్టేలా ఈ సినిమా ఉంటుందన్నారు మేకర్స్‌. న