– తరగతి గదులను, సముదాయాలను ప్రేమతో నడిపించేందుకు ఒక అసాధారణమైన అవకాశం
– తరగతి గదుల నిర్వహణ తీరును మార్చేందుకు, ప్రేమతో నడిపించేందుకు అసాధారణమైన అవకాశం
– 2025 టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 1, 2024
నవతెలంగాణ – హైదరాబాద్: బాలలకు సమాన విద్యా అవకాశాల కోసం పని చేస్తున్న ఒక సంస్థ టీచ్ ఫర్ ఇండియా, తన 2025 ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 1, 2024. టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అనేది రెండేళ్ల, పూర్తి-సమయం చెల్లింపు ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఇది ఉద్వేగభరితమైన వ్యక్తులను విద్యా రంగంలో నాయకులుగా, మార్పు తీసుకువచ్చే వారిలా మారడానికి సాధికారత ఇస్తుంది. కాగా, 640 మంది సభ్యులు 2024 కోహోర్ట్‌లో చేరగా, ఎడ్-ఈక్విటీ ఉద్యమంలో ప్రోగ్రామ్‌కు పెరుగుతున్న ప్రభావం, ప్రేరేపణకు ఇది బలమైన రుజువుగా మారింది. ఫెలోషిప్ దరఖాస్తు ప్రక్రియ అత్యంత ప్రత్యేకంగా, భారతదేశంలో ఉజ్వల, అత్యంత ఆశాజనకంగా ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఎంపికైన వారికి కఠినమైన శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ వారు విద్యా వ్యవస్థను దాని అట్టడుగు స్థాయి నుంచి అర్థం చేసుకునేలా ప్రేరేపణ అందుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటారు. టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌కు సంబంధించిన ప్రత్యేక అంశం ఏమిటంటే, ప్రస్తుత విద్యా విధానంలో ఆశాజనకమైన మార్పును తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఇది వారి మొత్తం వృత్తిపరమైన వృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా ఉండే నాయకత్వం, సమస్య పరిష్కారం మరియు నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం వంటి వివిధ అంశాలకు సంబంధించిన ఇన్‌సైట్లను కూడా అందిస్తుంది.