– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
– ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది
నవతెలంగాణ- నవీపేట్: బాసర నుండి నిజామాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడడంతో సుమారు గంటపాటు మూసిన రైల్వే గేట్ ఎత్తకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం బాసర నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఫకీరాబాద్ దాటిన తర్వాత దర్యాపూర్ గేట్ తో పాటు మండల కేంద్రంలోని ప్రధాన గేట్ మూసివేశారు. దర్యాపూర్ సమీపంలోకి వచ్చిన రైలు ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో అరగంటకు పైగా అక్కడే నిలిచిపోయింది. రైల్వే గేట్ కు సిగ్నల్ రాకపోవడంతో మూసిన గేట్ ఎత్తకపోవడంతో గేటుకు ఇరువైపులా కిలోమీటర్ మేరా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట తర్వాత రైలు వెళ్లిపోవడంతో గేటు ఎత్తారు.