రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆయన రోడ్‌ మార్గంలో కామారెడ్డికి వెళ్లారు. దీంతో సభలకు ఆలస్యమైంది. రాత్రి 7 గంటలకు సభలు ప్రారంభమ య్యాయి. ఏడు గంటలకు బిక్కనూరు, ఎనిమిది గంటలకు రాజంపేట, తొమ్మిది గంటలకు చిన్న మల్లారెడ్డి సభల్లో ఆయన ప్రసంగించారు.
నేడు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రచారం
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం ఖానాపూర్‌, అసిఫాబాద్‌ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నాందేడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం 10.30కు చేరుకోనున్నారు. అక్కడ గంట సేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి 12 గంటలకు అసిఫాబాద్‌కు రానున్నారు. నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం లంబాడ తండాలో మహిళలతో కలిసి ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేయ నున్నారు. అక్కడి మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు చేయనున్నారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేయను న్నారు. తిరిగి మద్యాహ్నం 1 గంటకు అసిఫాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళ్లనున్నారు.