న్యూఢిల్లీ : టెక్నో తన స్మార్ట్‌ఫోన్ పోర్టుపోలియోను విస్తరిస్తోంది. జనవరి 3న టెక్నో పాప్8 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అని తెలిపింది. 84జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో దీన్ని అందుబాటులోకి తెస్తోంది. 6.56 అంగుళాల పాండ స్క్రీన్ ప్రొటెక్షన్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో దీన్ని విడుదల చేస్తుంది.