తీజ్ పండగ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం

Teej festival is a testament to culture and traditions– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తొలకరి ముందు ఎంతో సంతోషంతో  ఘనంగా గిరిజనులు తీజ్ పండుగ నిర్వహించుకోవడం సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తేజ్ పండుగకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తీజ్ పండుగ అంటే రైతుల పండుగని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశిస్తూ చేసుకునే పండుగ తీజ్ అన్నారు. తిజ్ పండుగ సందర్భంగా ఆయన రైతులకు, ప్రత్యేకించి లంబాడా గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి లంబాడ గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, అదే రీతిలో తమ ప్రజా ప్రభుత్వం సైతం గిరిజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,  గిరిజన ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే  రైతులకు సైతం తాము ఇటీవల రుణమాఫీని అమలు చేయడం జరిగిందని అన్నారు. గిరిజనులకు ఇందిరమ్మ  ఇండ్లను ఇస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘువీర్, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.