నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: బైకు అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చౌటుప్పల్ పట్టణం లింగోజిగూడెంలో జరిగింది. మృతుడు ఇసురు ఉదయ్ తండ్రి రాఘవులు వయసు 25 సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామసుడు, సంవత్సరమున్నర క్రితం చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డి గూడెం గ్రామంలోని దివిస్ కంపెనీలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు.మంగళవారం ఉదయం అతని స్నేహితులైన రాయితీ రాజేష్, ఉపేందర్, ముగ్గురు కలిసి యాదగిరిగుట్టకు బైక్ పై వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి చౌటుప్పల్ లోని దివిస్ కంపెనీకి వస్తుండగా మార్గమధ్యలో చౌటుప్పల్ టౌన్ దాటిన తర్వాత లింగోజిగూడెం బ్రిడ్జి పైన మృతుడు ప్రయాణిస్తున్నటువంటి బైకు అదుపుతప్పి కింద పడిపోవడం వల్ల బైకు మధ్యలో కూర్చున్న మృతుడు ఎగిరిపడి డివైడర్ కు తగిలి తలకు బలమైన రక్తదాయమై అక్కడక్కడ మృతి చెందాడు, మిగిలిన స్నేహితులు ఇద్దరికీ గాయాలు అవ్వగా, హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు,మృతదేహం ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు నమోదు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.