
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో ముసురు వర్షానికి కూలిన ఇంటిని మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి లచ్చన్ గ్రామంలో ఇల్లు కూలిపోయింది. దానిని పరిశీలిస్తూ తహసీల్ధార్ ప్రభుత్వపరంగా నిర్వాసితులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇల్లు లేనందున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించాలని, కూలిపోయిన ఇంటి నిర్వాసితులు తహసీల్ధార్ ను కోరారు. తహసీల్ధార్ వెంట కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.