ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె అన్న కాళోజీమాతృభాషా స్ఫూర్తి, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి కాళోజి దిక్సూచి అని మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం మద్నూర్ నందు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఆ ప్రేరణతో తెలంగాణ యాస, బాష ఉద్యమ సమయంలో దాని ప్రాధాన్యత పెరిగి ఎంతో మంది కవులు, కళాకారులు బయటకు వచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్ లో మన తెలంగాణ సంస్కృతిని, భాష, యాస గౌరవాన్ని కాపాడేందుకు కవులు, రచయితలు కృషి చేయాలని ఆకాంక్షించారు. మండల ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని నినదించిన ప్రజా కవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారని, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిఒ వెంకట నర్సయ్య, గిర్దవార్ శంకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.