సర్వేకు ప్రజలు సహకరించాలి : తహసిల్దార్ ఎం. రమేష్

నవతెలంగాణ-ఆర్మూర్  : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని ఆలూరు తహసిల్దార్ ఎం. నరేష్ శుక్రవారం తెలిపారు. మండలంలోని 10 గ్రామాలు ఉన్నాయని, ఇంటింటికి స్టిక్కర్లు సైతం అతికించినట్టు, భూములు ఉన్నట్లయితే భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ,ఆధార్ కార్డు , ఫుడ్ సెక్యూరిటీ కార్డులను దగ్గర పెట్టుకొని వివరాలు చెప్పాలని కోరినారు.