అకాల వానలతో సంభవించే వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రభావిత నిర్వాసితులను తక్షణం మే కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.ఇందుకు గాను ప్రతీ నియోజక వర్గం కేంద్రం లోనూ వరద రక్షణ సామాగ్రి అందుబాటులోకి తెచ్చారు. పెద్దవాగు గండి పడి వరద పోటెత్తిన క్రమంలో వరదలో ఇరుక్కున్న 41 మందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు లు స్వీయ పర్యవేక్షణ లో హెలికాప్టర్ సహాయంతో ఎయిర్ లిఫ్టింగ్ చేసిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో వరదలు సంభవిస్తే వరద సహాయక చర్యలు నిమిత్తం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వరద సహాయక చర్యలు లో భాగంగా లైఫ్ జాకెట్ లు 10,లైఫ్ బోయ్ లు 10,25 మీటర్లు పొడవు గల రోప్ (తాడు) రక్షణ సామాగ్రిని కొనుగోలు చేసి ప్రతీ నియోజక వర్గం కేంద్రానికి సరఫరా చేసారు.ఈ సామాగ్రి ప్రస్తుతం అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ గురువారం తెలిపారు.