అక్రమ పట్టాలు రద్దు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముట్టడి

Tehsildar's office besieged to cancel illegal degreesకార్యాలయం ముందు బైఠాయించిన అమీర్ నగర్ గ్రామస్తులు 
ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తుల ఆరోపణ 
– సమస్య పరిష్కారానికి కోర్టుకే వెళ్లాలని ఆర్డీవో సూచన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ గ్రామ పరిధిలో గల సర్వేనెంబర్ 73లో అక్రమ పట్టాలను రద్దు చేయాలని కోరుతూ అమీర్ నగర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున   తహసిల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటికొకరు చొప్పున తరలివచ్చిన గ్రామస్తులు తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. పలు ట్రాక్టర్లలో మహిళలు కూడా పెద్ద ఎత్తున తహసిల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. గ్రామ పరిధిలోని పోరంబోకు భూమి సర్వే నంబర్ 73లో చౌట్ పల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని, వాటిని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అక్రమ పట్టలు చేసుకున్న వ్యక్తులు అట్టి భూముల్లో పంట సాగు పనులు చేస్తున్నారని వెంటనే అధికారులు జోక్యం చేసుకోని పనులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విషయమే గతంలో రెండు మూడు సార్లు వినతి పత్రాలు కూడా అందజేసినట్లు తెలిపారు.తక్షణమే అధికారులు సర్వే నిర్వహించి అక్రమ పట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే ఇక్కడ నుండి కదలబోమని గ్రామస్తులు బీష్మించారు. ఈ విషయమై కమ్మర్ పల్లి ఎస్ఐకి ఫోన్ చేస్తే గ్రామస్తులనే ఆ భూముల జోలికి వెళ్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఆ భూముల జోలికి గ్రామస్తులు ఎవరు వెళ్లొద్దని అంటున్నాడని తెలిపారు.గ్రామస్తులు ఆందోళన చేస్తున్న సమయంలోనే తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో రాజా గౌడ్ కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.స్పందించిన ఆయన కొందరు గ్రామస్తులను తహసిల్దార్ కార్యాలయంలోకి పిలిపించి మాట్లాడారు.భూముల విషయమై కోర్టులో కేసు నడుస్తున్నందున సమస్య పరిష్కారానికి కోర్టుకే వెళ్లాలని ఆర్డీవో గ్రామస్తులకు సూచించారు. ఆక్రమించుకున్న భూమిలో గ్రామస్తులు కొందరికి పట్టాలు ఉన్నాయని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా  మూడు నాలుగు రోజుల తర్వాత తహసిల్దార్ తో  రికార్డులు పరిశీలింపజేసి పట్టాలు ఉన్నది లేనిది తెలుస్తామన్నారు. అప్పటివరకు వేచి ఉండాలని అమీర్ నగర్ గ్రామస్తులకు ఆర్డీవో సూచించారు.  దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించి తిరిగి వెళ్ళిపోయారు.
Tehsildar's office besieged to cancel illegal degrees