నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో తాసిల్దార్ సతీష్ రెడ్డి పాల్గొని గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో జాబితాలో పేర్లు లేని అర్హులైన అభ్యర్థులు మళ్లీదరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ సతీష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం లోయూత్ కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు బీసగణేష్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు, పిఎసిఎస్ డైరెక్టర్ పోచయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.