బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: తహసిల్దార్ రవికుమార్

Strict action against child marriages: Tehsildar Ravikumarనవతెలంగాణ – మల్హర్ రావు
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మండల తాసిల్దార్ రవికుమార్ హెచ్చరించారు.శుక్రవారం మండలంలోని  రుద్రారం గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి ఇచ్చిన సమాచారం మేరకు తాసిల్దార్ తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. బాల్య వివాహం చేయడం చట్ట రీత్యా నేరమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 సంభత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని సూచించారు. బాలికను బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశ పెట్టి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ అన్నారు.బాల్య వివాహాలు చేస్తే భవిష్యత్ లో ఎదురైయ్యే పరిణామాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు బాలికను చదివించడానికి అంగీకరిoచినట్లుగా పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వీణ, డీసీపీయూ కౌన్సిలర్ శైలజ, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్, పోలీసులు  పాల్గొన్నారు.