విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: తహసీల్ధార్ రవీందర్

Be prepared to face disasters: Tehsildar Ravinder– జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో అవగాహన 
నవతెలంగాణ – తాడ్వాయి 
వరదలతో వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలని స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఊరట్టం, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల లో విద్యార్థులతో గ్రామస్తులతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ తోట రవీందర్, ఎన్ డీ ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపాల్ కుమార్, ఎంపీడీవో సుమన వాణి లు మాట్లాడుతూ వరదలు, భూకంపం, రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు తదితర ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, వాలంటీర్లకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. విపత్తులు సంభవించినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాలు, నిబద్ధతతో కూడిన వృత్తి నైపుణ్యాలతో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపదలో ఉన్న వారిని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఊరట్టం పాఠశాల హెచ్ఎం ఈసం రమేష్, ఎన్ డి ఆర్ ఎఫ్ టీం సభ్యులు హెచ్ రవి కుమార్,  గ్రామ పెద్దలు, వాలంటీర్లు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.