మాడుగులకు తహసీల్దార్‌ను నియమించాలి

Rangareddy,Telugu News,Telangana,Telangana News – అదనపు బాధ్యతల పని భారంతో డీటీ
– తహసీల్దార్‌ను నియమించాలని ప్రజల విజ్ఞప్తి
నవతెలంగాణ-మాడుగుల
మాడుగుల మండలానికి తహ సీల్దార్‌ను కేటాయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడ తహసీల్దార్‌గా విధు లు నిర్వహించిన సునీల్‌ గత నెల 25న కలెక్టరేట్‌ కార్యాలయానికి బదిలీ కావడంతో పోస్టు ఖాళీగా ఉండి పోయింది. అప్పటినుండి తహసీల్దార్‌ విధులను డిప్యూటీ తహసీల్దార్‌కు అప్ప గించారు. తహసీల్దార్‌ నిర్వహించే రిజిస్ట్రేషన్‌ విధులు ఇతర కార్యకలా పాలని డీటీకి అప్పజెప్ప డంతో డీటీకి కార్యాలయ నిర్వహణ, డీటీ విధులతో పాటు తహసీల్దార్‌ నిర్వ హించే రిజిస్ట్రేషన్‌ ఇతర అన్ని విధులు డీటీ రాజశేఖర్‌ చూస్తుండడంతో పరిభారం పెరిగి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, జిల్లా కలె క్టర్‌ వెంటనే స్పందించి మాడుగుల మండలానికి తహసీల్దార్‌ను నియ మించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.