విద్యతోపాటు వికాసాన్ని పెంపొందించుకోవాలి: తహసీల్దార్

నవతెలంగాణ – ధర్మసాగర్
నేటి విద్యార్థినీ విద్యార్థులు విద్యుత్ తో పాటు వికాసాన్ని పెంపొందించుకోవాలని స్థానిక తైసిల్దార్ సదానందం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్కులు, దుస్తులను విద్యార్థుల తల్లిదండ్రులు చేతుల మీద వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసిల్దారు సదానందం, ఎంపీడీవో అనిల్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ప్రారంభించిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు  నోటు బుక్కులు, యూనిఫామ్ అందజేయడం జరిగిందని, ఈ సదా అవకాశాన్ని బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుండి స్థిరమైన గమ్యాన్ని ఏర్పరచుకొని,కష్టపడి దానిని సాధించేందుకు ఇప్పటినుండే విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.విద్యార్థులు బాగా చదువుకొని విద్యలో రానుంచి ఉన్నత స్థితిలో జీవించాలని అన్నారు.ఎంపీడీవో అనిల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు,టీవీ లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి,మంచిని ఆస్వాదించి, దేశభవితకు ఉపయోగపడే విధంగా తయారు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  ఏ.వెంకటేశ్వరరావు, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంగళ మురళి,ఏపిఎం అనిత,ధర్మసాగర్ వి ఓ ఏ తోకల రజిత,కమ్యూనిటీ కోఆర్డినేటర్ కవిత,ఎంపీటీసీ వనమాల,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కే. లావణ్య, ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ ఎస్ ప్రసన్న,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఠాగూర్ శివరతన్ సింగ్, ఉపాధ్యాయులు వేణుగోపాల్,రమాదేవి, సరస్వతి దేవి,గణేషు,ఇమ్మయ్య, జ్యోతి, స్వర్ణలత,రమేష్ బాబు పాల్గొన్నారు.