ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన తహసిల్దార్ శ్రావణ్ కుమార్….

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తహసిల్దార్ శ్రవణ్ కుమార్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా అతనికి చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే కాకుండా, స్నాక్స్ కూడా అందించాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట సామాను ఏర్పాటు చేసుకోవాలని వార్డెన్ శ్రీకాంత్ కు సూచించారు. పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం వారికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట వార్డెన్ శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది గౌతమ్ తదితరులు పాల్గొన్నారు..