
సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చిన అధికారులకు వివరాలు వెల్లడించాలని తహశీల్దార్ శ్రీదేవి అన్నారు. మంగళవారం మండలంలోని మలక్ చించోలి గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వేను పరిశీలించారు. ఇంటివచ్చిన అధికారులకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలు వెల్లడించి ప్రజంత సహకరించాలన్నారు. అనంతరం వారు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. తహశీల్దార్ వెంట..రికార్డు అసిస్టెంట్ రాకేష్ , ఎన్యూమరేటర్ సాయెందర్ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.