ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ తోట రవీందర్

– కాల్వపల్లి గ్రామాన్ని సందర్శించిన స్థానిక తహసీల్దార్
నవతెలంగాణ – తాడ్వాయి 
గత రెండు రోజుల నుండి వర్షాలు కురిసిన సందర్భంగా స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ మండలంలోని ముంపు ప్రాంతమైన కాల్వపల్లి గ్రామాన్ని సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రవీందర్ మాట్లాడుతూ కాల్వపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న తూముల వాగు ప్రవాహం ఉధృతి ఎక్కువైతే దగ్గర్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వచ్చి షెల్టర్ తీసుకోవాలని సూచించారు. అనంతరం నాగమయ్య కుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ వరదలు ఎక్కువై, ఉధృతి పెరిగితే కాల్వపల్లి గ్రామస్తులు జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, మోటార్ల వద్ద రైతులు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. అధికారుల సలహా సూచనలు లేకుండా వాగులు చెరువులు దాటరాదన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పరిసర పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీ ఓ శ్రీధర్ రావు, ఆర్ఐ కీసర రాజ్ కుమార్, వీఆర్ఏ రాంబాబు తదితరులున్నారు.