తెలంగాణ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని సందర్శించిన తహసిల్దార్…

నవతెలంగాణ- రెంజల్
తెలంగాణ ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని రెంజల్ తహసిల్దార్ శ్రావణి కుమార్ సోమవారం పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారన్ని అందించాలని సూచించారు. ఇటీవల బియ్యం స్టాక్ లో పురుగులు వస్తున్నాయనీ వాటిని శుభ్రం చేయించి విద్యార్థులకు వంట చేయాలన్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. అనంతరం వసతి గృహానికి డ్రైనేజీ పైప్లైన్ వేయడానికి స్థలాన్ని ఆయన పరిశీలించి త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు పాస్టర్ వార్డెన్ సుచరిత పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మారై రవికుమార్, సుచరిత తదితరులు పాల్గొన్నారు