తహసీల్దార్ హెచ్చరికలు బేఖాతర్..

– తిరిగి126 సర్వే నెంబర్ లో ఇంటి నిర్మాణ మరమ్మతులు
– రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు
– స్పందించని అధికారులు
– ఇప్పటికే వివాదాస్పదoగా మారిన స్థలం
– ప్రభుత్వ స్థలాన్ని కి కంచె ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు
నవతెలంగాణ-సూర్యాపేట : పట్టణంలోని కుడ కుడా లో గల 126 వ సర్వే నెంబర్ లో తహశీల్దార్ హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలలో మరమ్మతులు కొనసాగుతున్నాయి.జిల్లా కేంద్ర పరిధిలో కుడ కుడా కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కోమటి కుంట నుండి నూతనంగా ఏర్పడిన కలెక్టరేట్ కు వెళ్లే ప్రధాన రహదారి కి అనుకోని ఉన్న పల్లె ప్రకృతి వనం ఎదురుగా ఉన్న 126 సర్వే నెంబర్ కు చెందిన గుట్ట ప్రాంతంలో నిబంధనలకు  విరుద్ధంగా  విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని గత నెల 12 వ తేదీన నవ తెలంగాణ దిన పత్రిక లో వార్త కథనం వచ్చిన విషయం తెల్సిందే. కాగా వార్త పట్ల చివ్వేంల మండల తహసీల్దార్ కృష్ణయ్య స్పందించి 126 వ సర్వే నెంబర్ లో వెలుస్తున్న వరుస నిర్మాణాలపై  విచారణ నిర్వహించారు.వెంటనే అక్రమ కట్టడాలు తొలగించాలని ఆక్రమిత దారులను హెచ్చరించిన విషయం తెల్సిందే.  కాగా ఇక్కడి అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ భూమితో పాటు ప్రక్కనే అనుకోని ఉన్న 127 వ సర్వే నెంబర్ భూమి లో కూడా కొన్ని గజాల స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణo చేపట్టడo పై కూడా తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.ఈ క్రమంలో దాదాపుగా 70 మంది అక్రమంగా ఇండ్లను నిర్మించుకోవడాన్ని చూసిన తహసీల్దార్ తక్షణమే నిర్మాణం చేపడుతున్న ఇళ్లను కూల్చివేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వారికి  నోటీసులు జారీ చేశారు. 126 వ సర్వే నెంబర్ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా దాదాపుగా నెల రోజుల తర్వాత తహశీల్దార్ హెచ్చరికలను లెక్క చేయకుండా ఆక్రమణ దారులు నిర్మించిన ఆక్రమిత కట్టడాలలో తిరిగి వాటికి మరమ్మతులు చేస్తూ యధేచ్చగా పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు.తహశీల్దార్ హెచ్చరికతో గతంలో మధ్యలోనే నిలిపివేసిన నిర్మాణ పనులకు మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ నిర్మాణాలు పట్టపగలే కొనసాగుతున్న అధికారులు అడ్డు చెప్పక పోవడం గమన్హారo.ఈ తతంగాన్ని చూసిన స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులో స్పందన కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే వివాదాస్పదoగా మారిన స్థలంలో యధేచ్చగా నిర్మాణాలు సాగడం అనుమానాలకు తావిస్తోంది.ప్రభుత్వ స్థలాన్ని కి కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు చెబుతున్న అధికారుల్లో మాత్రం చలనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇండ్లు నిర్మించుకొని మరమ్మతులు చేస్తున్న వారి పై చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.