
బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండా అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తహసీల్దార్ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంగన్వాడి సెంటర్ లో స్టాక్ వివరాలు,రికార్డులు కేంద్రానికి వచ్చే చిన్నారుల, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన మాట్లాడుతూ.. పిల్లల హాజరు శాతం పెంచాలని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్నరున్నిసాభేగం, అంగన్వాడి టీచర్,తదితరులు ఉన్నారు.