సమగ్ర సర్వేను పరిశీలించిన తహసీల్దార్

Tehsildar who inspected the comprehensive surveyనవతెలంగాణ – మద్నూర్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మద్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. ఈ సంధర్భంగా సర్వే ను మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి ముజీబ్, ఎంపీడీవో రాణి లు పరిశీలించారు. సర్వే వల్ల వస్తున్న సమస్యలు, ప్రజల స్పందన ను సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సర్వే లో పాల్గొనాలని కోరారు.  సర్వే వలన రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల ఆర్థిక, సామాజిక అంశాలను అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేయాలని సంకల్పించి నందున అందరూ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కు సహకరించాలని అన్నారు. ఈ పరిశీలనలో మండల గిర్దవార్ శంకర్, మద్నూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శి సందీప్ లు పాల్గొన్నారు.