మీసేవ కేంద్రంను ప్రారంభించిన తహసీల్దార్

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల సమీపంలో శనివారం మండల తహసీల్దార్ సరోజ పావని, మండల విద్యాధికారి లావూరి బాలునాయక్ నూతనంగా ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఆధార్‌ కార్డ్‌ ప్రాముఖ్యత చాలా ఉందని ఆస్పత్రుల నుంచి బ్యాంక్​లు, కళాశాలలు, రేషన్‌ దుకాణాలు ఇలా ప్రతి దగ్గర ఆధార్‌ కార్డు అవసరం అవుతోందని అన్నారు.అధికారిక గుర్తింపు కార్డ్​గా దీనికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే ఆధార్‌పై ఉండే వివరాలు తప్పుల్లేకుండా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పారు.పొరపాటున ఏవైనా తప్పులున్నా వెంటనే వాటిని సరి చేయించుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, వెల్మ గూడెం జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు హిమావంత్ రెడ్డి, ఉపాధ్యాయులు శైలజ, మండల ఎంపీటీసి ల ఫోరం అధ్యక్షులు పులిమాల కృష్ణారావు, మాజీ ఎంపీటిసి లక్ష్మణ్, మేదరి నాగయ్య, సామాజిక కార్యకర్త తగరం శ్రీనివాస్,సిఆర్పీ దుబ్బ పరమేష్ గ్రామస్తులు వున్నారు.