కస్తూరిబా గాంధీ పాఠశాలను సందర్శించిన తహసిల్దార్..

Tehsildar visited Kasturiba Gandhi school.నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సాయంత్రం శ్రావణ్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలో రికార్డులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్ లోని వస్తువులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, డిజిటల్ బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలను అందించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఆర్ ఐ రవికుమార్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, శ్రావణ్ కుమార్, సిబ్బంది సుజాత, స్వప్న, ఉపాధ్యాయ బృందం, వంట కార్మికుల పాల్గొన్నారు.