ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఇబ్బంది పెడుతున్న తహసీల్దార్ కార్యాలయం

Tehsildar's office is causing trouble for MLC vote registrationనవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలో గల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేయడానికి పట్టపద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా మూడుసార్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు వేయాలి. ఒకసారి అప్లికేషన్ ఫామ్ లేదంటారు రెండోసారి వెళ్తే అప్లై చేస్తారు. మళ్లీ అప్లై చేసిన వారం రోజుల గడువు తర్వాత తాసిల్దార్ కార్యాలయం నుంచి మీ వర్జినల్ సర్టిఫికెట్స్ డిప్యూటీ ఎమ్మార్వో  తీసుకురమ్మని ఆఫీసు సిబ్బంది చరవానిలో ఓటు హక్కు అప్లై చేసుకున్న పట్టభద్రులకు ఫోన్ చేస్తారు. చాలామంది పట్టభద్రులు తమ అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన వెంటనే తమ ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాల్లో ఉంటారు. మళ్ళీ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని తీసుకొని తాసిల్దార్ కార్యాలయం రావాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెలవు దినాల్లో వస్తే ఇక్కడ స్థానిక కార్యాలయాలకు కూడా సెలవు ఉంటుంది. వారి ఆఫీసుల్లో సరైన సమయంలో వారికి లీవ్స్ ఇవ్వరు మరి పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలా ప్రజాస్వామ్యంగా వారు ఓటు వేయాలా లేదా అని ఇక్కడ తాసిల్దార్ కార్యాలయం నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పట్టబద్రులు కోరుతున్నారు. ఒకవేళ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే పట్టబదులు ఎమ్మెల్సీ ఓటు నమోదు విషయంలో వెనకంజలో ఉంటారు. ఓటు అనే ఆయుధానికి పట్టభద్రులందరూ దూరమవ్వాల్సి ఉంటుంది.