మండలంలోని 18 గ్రామపంచాయతీలో నిర్వహించిన కుటుంబ సర్వే ప్రక్రియను తాడ్వాయి తాసిల్దార్ బి.గిరిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్ధార్ గిరిబాబు మాట్లాడుతూ.. ఆర్థిక సామాజిక రాజకీయ విద్య ఉపాధి కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటా కుటుంబ సర్వేకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఎన్యూమరేటర్లు పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించి సర్వే పనులు నిర్వహించాలన్నారు. సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎనిమరేటర్లు వివరాలు నమోదు చేయాలని తాసిల్దార్ సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తాసిల్దార్ సురేష్ లు ఉన్నారు.