నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నెల్లికుదురు మండల కమిటీ అధ్యక్షునిగా కుమ్మరి కుంట్ల మౌనేందర్ కార్యదర్శి కసర బోయిన విజయ యాదవ్ ను ఎన్నుకున్నట్లు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముద్ద సాని వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మండల కమిటీ వివరాలు వెల్లడించారు. ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులుగా కుమ్మరి కుంట్ల మౌనేందర్ ప్రధాన కార్యదర్శిగా కసర బోయిన విజయ్ యాదవ్ ముఖ్య సలదారులుగా మద్ది వెంకన్న జిలకర యాలాద్రి ని ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానుకోట ఉద్యమకారుల ఫోరం టి యు ఎఫ్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు తొర్రూర్ డివిజన్ అధ్యక్షులు అన్నపురం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ ఈనెల చలో మాను కోట జనవరి 19 న ఆదివారం రోజున 10 గంటలకు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నెల్లికుదురు మండలంలోని అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరిపళ్లి ఉప్పలయ్య పాల్గొన్నారు.