
మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం కు అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ మన్నే దినా తెలిపారు. ఈనెల 10 నుంచి 31 వరకు ఆన్లైన్లో అడ్మిషన్ అప్లికేషన్ ప్రారంభం అయిందని ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే మండల కేంద్రంలోని ఇతర మండలాలలో పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేయవలసిందని కోరారు. అదేవిధంగా ఎంపీసీ. బైపిసి. సీఈసీ. ఎంఈసి నాలుగు గ్రూపుల విభాగంలో ప్రతి గ్రూపుకు 40 సీట్ల చొప్పున ఉంటాయని వివరించారు. కావున పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు త్వరగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని కోరారు ఆన్లైన్ అప్లికేషన్ ఈ క్రింది వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులువెబ్సైట్ www.tsmodelschools.com ఆన్లైన్ ద్వార దరఖాస్తులు చేసుకొని ఆదర్శ కళాశాలలో ప్రవేశం పొందవచ్చు అని ప్రిన్సిపాల్ వివరించారు.