
ఈనెల 20, 21, 22 తేదీలలో జరగాల్సిన రాజకీయ సామాజిక అవగాహన శిక్షణ తరగతులు పని ఒత్తిళ్లు ఇతర అనివార్య కారణాల వలన ప్రజా సమస్యల ఉద్యమాల వల్ల తప్పనిసరిగా వాయిదా వేయవలసి వస్తున్నందున చింతిస్తున్నామని నిజామాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట రాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగుల గోవర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట రాములు మాట్లాడుతూ.. ప్రధానంగా ఈ సమావేశంలో జిల్లా క్లాసులల, ప్రజా సమస్యలు, సంఘం నిర్మాణం గురించి చర్చించారు. మళ్ళీ ఈ జిల్లా క్లాసులు ఫిబ్రవరి, 15,16,17, 2025 తేదీలలో జరుగుతాయి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మార్పును సంఘం నాయకులు, కార్యకర్తలు, క్లాసులకు హాజరయ్యే ప్రతినిథులు, శ్రేయోభిలాషులు గుర్తించి క్లాసుల జయప్రధానికి తోడ్పడగలరని మనస్పూర్తిగా జిల్లాకమిటి కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, గోళం లక్ష్మి, సాయిలు, శ్రీను, నర్ర శంకర్, అశోక్, కె సూరి, చంధ్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.