తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీ (ఆదివారం )మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ (నామ్ దేవాడ) లో జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డి. ఏ. లను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ , ప్రైవేట్ ఆసుపత్రులలో అనుమతించాలని, ఫిట్మెంట్ 30% అనుమతించాలని, దీనికి సంబంధించి రాష్ట్ర సంఘం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి పదవ తేదీన పెన్షనర్ల కుటుంబ సమ్మేళనాన్ని నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ సభకు ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త దేవి ని, కామారెడ్డి పోలీసు సూపర్డెంట్ సింధు శర్మ ని ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహకంగా మహిళ పెన్షనర్లతో ఫిబ్రవరి 8వ తేదీన మల్లు స్వరాజ్యం ట్రస్టు భవనం నాందేవాడలో ఉదయం 11 గంటలకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మహిళా పెన్షనర్లు సమావేశానికి తప్పక రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్ల కార్యవర్గాలను (రీ- కాన్స్టిట్యూట్ ) పునర్ నిర్మించాలని, దీనికి సంబంధించి వెంటనే తేదీలను డివిజన్ నాయకులు తెలపాలని కోరటం జరిగింది. నిజామాబాద్ జిల్లా లోని ఈపీఎస్ పెన్షనర్ల ను ఐక్యపరిచి ఆందోళన, సంఘ నిర్మాణం తదతర కార్యక్రమాల నిర్వహణ కొరకు అద్దంకి ఉషాన్ (బోధన్)ని జిల్లా కన్వీనర్ గా ఎంపిక చేయటం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులను ఆర్గనైజ్ చేయటం కోసం ఈ వీ ఎల్ నారాయణ నీ ఎన్నుకోవడం జరిగింది.రిటైర్డ్ ఉద్యోగుల ఇన్కమ్ టాక్స్ సమస్యలపై వెంటనే డి టి ఓ ని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. సంఘం పక్షాన త్వరలో మెడికల్ క్యాంపును నిర్వహించాలని తీర్మానించడం జరిగింది.