అమెరికాలో సత్తా చాటిన తెలంగాణ అథ్లెటిక్స్‌

అమెరికాలో సత్తా చాటిన తెలంగాణ అథ్లెటిక్స్‌– హైదరాబాద్‌కు చేరుకున్న మాస్టర్‌ గేమ్స్‌24 విజేతలు
– ఘన స్వాగతం పలికిన పలువురు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పాన్‌ అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌ 2024లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రపం చానికి భారతదేశ ఖ్యాతిని చాటిన విజేతలు బుధ వారం హైదరాబాద్‌ చేరుకోవడంతో వారికి పూల మాలలతో ఘన స్వాగతం పలికారు హైదరాబాద్‌ ప్రజలు. జూలై 12 నుండి ప్రారంభమైన పాన్‌ అమెరికన్‌ అంతర్జాతీయ మాస్టర్‌ గేమ్స్‌లో వివిధ క్రీడలైన అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, ఆర్చరీ, సైక్లింగ్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, గోల్ఫ్‌, సాకర్‌ మరెన్నో క్రీడలలో భారతదేశం నుండి 59 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్తర అమెరికా ఒహి యో స్టేట్‌ క్లీవ్‌ల్యాండ్‌ నిర్వహించిన క్రీడలో భాగం గా జూలై 18న అథ్లెటిక్స్‌లో తెలంగాణ నుంచి 2 స్వర్ణాలు, 2 కాంస్య పతకాలు మొత్తం 14 పతకా లు భారత్‌ సాధించింది. జావెలిన్‌ త్రోలో భారత్‌ తరపున ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిన డాక్టర్‌ జగజీవన్‌ రెడ్డి, మహిళలు షార్ట్‌ పుట్‌లో వేసపోగు శ్యామల కంచు పతకం సాధిం చగా స్విమ్మింగ్‌ లో హైదరాబాద్‌కు చెందిన షేక్‌ సాజిదా ఫ్రీ స్టైల్‌లో బంగార పతకం, బ్యాక్‌ స్ట్రోక్‌ లో కాంస్య పతకం సాధించారు. తెలంగాణకు చెం దిన న్యాయవాది, మాస్టర్స్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జగజీవన్‌ రెడ్డి పురుషుల విభాగంలో బంగారు పతకాన్ని సాధించడం, మహిళల విభాగంలో తె లంగాణకు చెందిన సైఫాబాద్‌లోని అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ వేసపోగు శ్యామల కాంస్య పతకాన్ని సాధించడం, ఎయిర్‌ఫోర్స్‌ అకా డమీ దుండిగల్‌లో స్విమ్మింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్న షేక్‌ సాజిదా బంగారు, కాంస్య పతకాలు సాధిం చడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని హైద రాబాద్‌ చేరుకున్న వారికి క్రీడాకారులు, క్రీడాభి మానులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్ర యంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఇది భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వ కారణమని, అంతర్జాతీయంగా మన క్రీడాకారుల సత్తాను నిరూపించారని, మూడు రంగుల జెం డాతో వారికి స్వాగతం పలుకుతూ ప్రశంసించారు.