తెలంగాణ బైండ్ల కుల రాష్ట్ర నాయకుడు జిలకర యాలాద్రి 

నవతెలంగాణ – నెల్లికుదురు 
ఏబిసిడి వర్గీకరణ తో 30 ఏళ్ల పోరాటంతో బైండ్ల కులానికి ఒరిగింది ఏమీ లేదని వాస్తవానికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బైండ్ల కుల రాష్ట్ర నాయకుడు జిలకర యాలాద్రి అన్నాడు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ దళితుల ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటం తో బైండ్ల కులానికి ఒరిగిందేమీ లేదు అన్యాయమే జరిగింది అని అన్నాడు. వాస్తవంగా బైండ్ల కులం జనాభా  50,000 జనాభా ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా దానిని వక్రీకరించి 2001 నాటి ది13 వేల జనాభా ను ఉన్నట్టుగా సృష్టించింది. ఎస్సీ ఉపకులం అయినటువంటి  బైండ్ల కులానికి అన్యాయం చేశారని అన్నారు. వర్గీకరణ విషయములోఎస్సి  కమిషనర్ శమీ అత్తర్  కి వినతి పత్రం ఇచ్చి ఏ కేటగిరీలో ఉంచాలని కోరిన మాల మాదిగలు కలిసి బైండ్ల కులాన్ని వర్గీకరణ పేరుతో పెద్ద మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చెందారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బైండ్ల కులాని కి రావలసిన ఏ క్యాటగిరి ని రాకుండా చేసి  బైండ్ల కులం మళ్లీ ఎస్సీ బీ లో ఉంచడం బాధాకరం అని తెలిపాడు. బైండ్ల కులం గురించి మాట్లాడని రాష్ట్ర అధ్యక్షుల మనీ పేరు చెప్పుకునే వారు ప్రజాప్రతినిధులు కూడా వారి పదవులకు  రాజీనామా చేయాలి అని కోరారు. కేంద్రo, తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించి చొరవ చూపి బైండ్ల కులాన్ని బైండ్ల కులాన్ని ఏ కేటగిరీలో ఉంచాలి ఏ కేటగిరి లో ఉంచితే బైండ్ల కులానికి న్యాయం జరుగుతుందని తెలంగాణ బైండ్ల రాష్ట్ర సంఘం నాయకుడు జిలకర యాలాద్రి అన్నారు.