– పునర్వీభవజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీకి) తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పునర్వీభజన చట్టం-2014ను ఉల్లంఘిస్తున్నదని అందులో పేర్కొంది. ఈమేరకు తెలంగాణ సాగునీరు,ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ఇటీవల కేఆర్‌ఎంబీ చైర్మెన్‌కు లేఖ రాశారు. అనంతంపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 4100 ఎకరాల ఆయకట్టును స్థీరికరించేందుకు అక్రమంగా చర్యలు తీసుకుంటున్నదని లేఖలో విమర్శించింది. గుమ్మగాట, రాయదుర్గం, డి.హిరేహల్, కనెకల్ మండలాల పరిధిలోని 58 మధ్యతరహా ట్యాంకులను నింపేందుకు టెండర్లు పిలిచారని గుర్తు చేసింది. మొత్తం భైరవనతిప్ప ప్రాజెక్టు పరిధిలో సర్వే, లెవెలింగ్ పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలియజేసింది. సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి సైతం లేదని విమర్శించారు. వెంటనే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపాలని విజ్ఞప్తి చేశారు.