తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన..

Telangana comprehensive punishment employees protest..నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం  రాష్ట్ర కమిటి పిలుపు మేరకుఈరోజు TSSUS గాంధారి మండల శాఖ అద్వర్యంలో  సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని /తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జిలు ధరించి, ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చెయ్యాలని నిరసన తెలిపినారు. ఈ సందర్బంగా TSSUS మండల అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మే చేస్తున్న సందర్భంలో హన్మకొండ లోని సమ్మే శిబిరానికి 13/09/2023 రోజున అప్పటి టీపీపీసీ అధ్యక్షులునేటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మద్దతు తెలుపుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని & పే స్కెల్ అమలు, చేస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న ఇప్పటి వరకు హామీ నెరవేరలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.లేనిచో డిసెంబర్ మొదటి వారంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె కు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల జాక్ అధ్యక్షులు ప్రసాద్  క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ రామారావు , సాయిలు , రాజు, షహీద్ ,  తదితరులు పాల్గొన్నారు.