ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..

నవతెలంగాణ – భీంగల్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ చేస్తావా అన్న పట్టణ కేంద్రంలో అన్ని ప్రభుత్వ  శాఖలలో ఘనంగా జరుపుకున్నారు. తాసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏవో సాయి కృష్ణ, సిఐ శ్రీనివాస్, ఎస్సై హరిబాబు, ఎం ఈ ఓ స్వామి, ఏపీ ఓ నరసయ్య లో తమ కార్యాలయాలలో తెలంగాణ జెండాను ఎగురవేశారు.  మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ జెండాను ఎగరవేశారు.అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో తెలంగాణ జెండాను ఎగురవేసి జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.  ఈ వేడుకల్లో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.