తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

– రాష్ట్ర ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ గువ్వల బాలరాజ్‌
– జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శాంత కుమారి
– ప్రతి కార్యక్రమంలో ప్రజలను భారీగా భాగస్వామ్యం చేయాలి
– తొమ్మిదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేప్పండి
– ప్రతి రంగంలో నాటి, నేటి ప్రగతిని ప్రజలకు కర్రపత్రాలు ఫోటోలతో వివరించండి
– అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి :కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి
– పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్‌ కుమార్‌
నవతెలంగాణ- కందనూలు
తొమ్మిదేళ్ల నాగర్‌ కర్నూలు జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని యావత్‌ ప్రజానీకానికి తెలియజేస్తూ.. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తూ.. స్వరాష్ట్రం కోసం తెలంగాణ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను అట్టహాసంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గువ్వల బాలరాజ్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలపై బుధవారం నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల, జిల్లా స్థాయి అధికారులతో అవగాహన సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శాంత కుమారి కొల్లాపూర్‌ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలు హాజరై దిశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రోజుకో శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలను అన్ని నియోజకవర్గస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఘనమైన చరిత్ర ఉన్న నాగర్‌ కర్నూలు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ గువ్వల బాలరాజ్‌ అధికారులను అదేశించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ….. జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతుందన్నారు. అనేక విజయాలను సాధించామన్నారు. ఇది ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో సాధ్యమైనదన్నారు.ఆంధ్రుల పాలనలో ఒకనాడు గంజి కేంద్రాలు నడిచిన జిల్లాలో ఇయ్యాల స్వరాష్ట్ర పాలనలో పచ్చని పంటలు పారే వాగులతో పాలు గారే పరిస్థితి జిల్లాలో నేడు ఉందన్నారు.నాటి నేటి పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని అధికారులు, ఉద్యోగులు పూర్తి స్దాయిలో భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ కోరారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు సరిపోకుంటే ఎమ్మెల్యేలు సొంతంగా భరించేలా అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడుతానన్నారు. ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నపెగు బంధంను విడదీయరానిదన్నారు. పోరాటాలు, త్యాగాలతో ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. అమరుల త్యాగాలు స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరపాలన్నారు. 21 రోజుల పాటు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏరోజు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శాంత కుమారి ,జిల్లా కలెక్టర్‌ పి ఉదరు కుమార్‌ ,కొల్లాపూర్‌ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్‌ రెడ్డి,జిల్లా ఎస్పీ కే మనోహర్‌ మాట్లాడుతూ……సురక్షాదినోత్సవం రోజు ర్యాలీని కూడా ఏర్పాటు చేస్తామని, షీటీమ్‌, భరోస,సైబర్‌ నేరాలు, తెలంగాణ పోలీసుల ప్రతిభ గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌ మోతిలాల్‌, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్‌ గోపిడి, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తాహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.