సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ పెద్దవంగర: ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని మోత్య తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ సుధీర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆభివృద్ధిపై ఇతర రాష్ట్రల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణ హయాంలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బొమ్మకల్లు ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కూతురు అనుదీప్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దస్రు నాయక్, భూక్యా యాకన్న, భూక్యా ప్రవీణ్, భూక్యా నరేష్, గుగులోతు నరేష్, గుగులోతు నవీన్ తదితరులు పాల్గొన్నారు.