తెలంగాణ విద్య దినోత్సవం ఘనంగా నిర్వహించాలి..

– విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుపతి దేవస్థానం వద్ద జిల్లా విద్యాధికారులతో విద్యారంగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 9 మండలాల్లో ఈనెల 20న విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. విద్యా దినోత్సవ సందర్భంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని హంగులతో నిర్మించిన మైలారం ప్రాథమిక పాఠశాల భవనంను ప్రారంభించిన అనంతరం బాన్సువాడ ఎస్ఆర్ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో  భారీ బహిరంగ సభ ఏర్పాటు, ఈ బహిరంగ సభలో 2014 నుంచి విద్యాభివృద్ధికి చేసిన నివేదికను వివరించాలని, ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కళాశాల వరకు అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలను నిర్వహించి విజయాలను వివరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు సకల హంగులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు-మన బడి కింద సకల వసతులతో ఆధునికీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యాభివృద్ధికి అత్యధికంగా కృషి చేస్తుందని, తెలంగాణలో అత్యధికంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండేసి జతల యూనిఫామ్ , పుస్తకాలను అందిస్తున్నామని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, బాన్సువాడ మండల విద్యాధికారి నాగేశ్వర రావు,