అంపశయ్యపై తెలంగాణ విద్యారంగం

అంపశయ్యపై తెలంగాణ విద్యారంగందేశంలో విద్యారంగం స్థితిగతులపై అధ్యయనం చేసి వివరాలను చెప్పే యాన్యువల్‌ స్టాటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఆసర్‌) 2023 రిపోర్ట్‌ను 2024 జనవరి 17న వెల్లడించింది. ఈ సర్వే రిపోర్ట్‌లో తెలంగాణ విద్యారంగంలో ఆందోళనకర విషయాలు వెల్లడించింది. మొత్తం దేశంలో 2023 డిసెంబర్‌ 15 వరకు 26 రాష్ట్రాలలో 28 జిల్లాల్లో 1664 గ్రామాలలో 30,074 కుటుంబాల నుండి 34,745 మంది విద్యా ర్థులలో ఈ సర్వే నిర్వహించింది. 14 ఏండ్ల నుండి 16 ఏండ్ల వరకు పాఠశాల స్థాయి,17-18 ఏళ్ల వరకు ఇంటర్‌ కళాశాల స్థాయి విద్యార్థును ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. తెలంగాణ రాష్ట్రం లో ఖమ్మం జిల్లాలో 59 గ్రామాలు, 689 గహా లలో 709 మంది విద్యార్థులను సర్వేలో భాగస్వా మ్యం చేశారు. ఈ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు 14-16 వయసున్న వారిలో 42.2శాతం మంది,17-18 వయసున్న వారిలో 50.3శాతం మంది విద్యార్థులు కనీసం మాతభాష అయిన తెలుగులో రెండవ తరగతి పాఠా లను చదవలేక పోతున్నారని వివరించింది. తెలుగు మాత్రమే కాదు కనీసం అర్థమేటిక్‌ స్కిల్స్‌లో కూడ 14-16 వయసున్న వారిలో 21.5శాతం 17-18 వయసున్న వారిలో 18శాతం, ఇంగ్లీష్‌ చదవడంలో 14-16 వయసున్న వారిలో 45శాతం, 17-18 వయసున్న వారిలో 41.4శాతం మంది మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నారని తెలిపింది. ఇది తెలంగాణ విద్యారంగ భవిష్యత్‌ మరింత ఆందోళన కలిగించే అంశం. అలాగే ఈ రిపోర్టులో మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే తమ చదువుల కోసం గత ఆరు నెలల కాలంలో నెలలో 15 రోజుల కంటే ఎక్కువ వారి కుటుంబ పనిలోనూ లేదా పార్ట్‌ టైం లేదా ఫుల్‌ టైం పనిలో ఉండి చదువుకునేవారు 14-16 ఏళ్ల వయ సున్న వారు 47.3శాతం, 17-18 వయసున్నవారు 68.7 శాతం ఉంటే విద్యార్థినిలులే 58.8శాతం మంది చదువుకు దూ రంగా ఉండి పని చేస్తూ చదువుకుంటున్నారు. చదువుకుంటూనే 3.5శాతం మంది తక్షణ ఉద్యోగాల కోసం కంప్యూటర్‌ లాంటి కోచింగ్‌ కూడా తీసుకుంటున్నారని ఆందోళనకర విషయాలు ఆసర్‌ నివేదిక వెల్లడించింది.
ఇదే కాదు దక్షిణాది రాష్ట్రాలలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం చిట్టచివరగా ఉంది. ఈ జాబితాలో విద్యార్థులకు సామర్ధ్యాలను పెంచటంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. 14- 16 వయస్సు వారిలో పాఠశాలలో చేరకుండా ఉన్నవారిలో కేరళలో 0.5శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 23.1 శాతం ఉంది. 17-18 వయసున్న వారు మధ్యలో చదువు మానివేస్తున్న వారు కేరళలో 18.6శాతం ఉంటే తెలంగాణాలో 40.1శాతం ఉంది. విద్యార్థులకు సామర్థ్యాలను పెంచడంలో కేరళ అగ్రస్థానంలో ఉంటే తలసరి ఆదాయం మిన్నగా ఉంటూ అభివద్ధికి కేరాఫ్‌ తెలంగాణ అంటున్న మన రాష్ట్రం అందరికంటే వెనుకబడి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికే తలవంపు. గత పదేండ్లుగా ప్రభుత్వం విద్యపట్ల నిర్లక్ష్యం వహించడమే ఈ దుస్థితికి కారణం. తెలంగాణ విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇది ఖమ్మంలాంటి చోట్ల సర్వేలోనే ఈ రకమైన అంశాలు వెల్లడైతే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జిల్లాలు, అటవీప్రాంతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాలలో ఈ పరిస్థితులు మరింత ఆందోళనాకరంగా ఉండే అవకాశాలను అర్థం చేసుకోవచ్చు.
ఖాళీలు నింపరు-నిధులివ్వరు
ఈ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రభుత్వ బడు లలో ఖాళీలు నింపకపోవటం. గత పదేండ్లలో తెలంగాణ రా ష్ట్రంలో వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. నెలనెలా రిటై ర్మెంట్‌ ఖాళీలు ఏర్పడుతున్న ఉపాధ్యాయులను నియమించకుం డా ప్రభుత్వం ప్రభుత్వ విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. గత పదేండ్ల కాలంలో విద్యారంగంపై పాలకులు సమీక్ష నిర్వహిం చలేదు, విద్యార్ధుల అభ్యాసన పద్ధతులు పెంచడం, మౌలిక వస తులు కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. కరో నా కంటే ముందు రాష్ట్రంలో 12 వేల విద్యావాలంటీర్లను నియ మించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ,కరోనా సందర్భంగా తొల గించి, మళ్లీ భర్తీ చేయలేదు. తెలుగు మీడియం పాఠశాలలతో పాటు ఇంగ్లీషు మీడీయం అప్‌ గ్రేడ్‌ చేస్తూనే, తెలుగు మీడియం ఉపా ధ్యాయులే ఇంగ్లీషు మీడియం కూడా బోధించాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లీ షు మీడియంలలో 24,000 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 17,873టీచర్‌ పోస్టులు భర్తీ చేయా లని చెబుతున్న వాటిని కూడా ఇప్పటికి భర్తీ చేయలేదు. బడులను పర్యవేక్షణ చేసే మండల, జిల్లా విద్యాశాఖ పోస్టులను భర్తీ చేయలేదు, టీచర్‌ ట్రైనింగ్‌ సంస్థలో ఉపాధ్యాయులను తయారు చేసే డైట్‌,బిఇడి కళాశాలలో విధానాలు రూపకల్పన చేసే ఎస్సీఈఆర్టీలో కూడా ప్రొఫె˜సర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నా యి. రాష్ట్రంలో 608 మండలాలకు గాను కేవలం 17 మండ లాల్లో మాత్రమే రెగ్యులర్‌ ఎం.ఇ.ఓలు ఉన్నారు, 66 డిప్యూటీ డి.ఇ.ఓ.లకు గాను ఆరుగురు మాత్రమే రెగ్యులర్‌ ఉన్నారు, 33 జిల్లాలకు కేవలం ఏడుగురు జిల్లా విద్యాశాఖాధికారులు మాత్ర మే ఉన్నారు. ఒక్కో మండల విద్యాశాఖధికారి రెండు నుండి మూడు మండలాలకు ఇంఛార్జి ఎం.ఇ.ఓ.లుగా ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. కరోనా తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులు ఎన్రోల్‌ పెరిగిన, సార్లు , సౌక ర్యాలు లేక మళ్లీ ప్రయివేటు బాట పడుతున్నారు. ప్రయివేటు విద్యాసంస్థలలో అయినా నాణ్యమైన విద్య అందుతుందా అంటే అక్కడ కూడా సామర్థ్యం పెంచే పక్రియ కాకుండా బట్టి విధానం అమలు చేస్తున్నారని జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం -2009 నిర్దేశిం చిన ప్రమాణాలను 40,597 ప్రభుత్వ పాఠశాలలకు కేవలం ఆరు శాతం మాత్రమే కలిగి ఉన్నాయని నేషనల్‌ శాంపిల్‌ సర్వే లో వెల్లడైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన భవనాలు, మూత్ర శాలలు, ఆటస్థలాలు, కరెంటు సౌకర్యం, ప్రహరీ లేకపోవడం, మధ్యాహ్నం భోజనం నాణ్యంగా అందించకపోవడం, తాగునీరు అందకుండా ఉండే పరిస్థితి ఇంకా వేధిస్తునే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మారకుండా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించే స్థితిలో ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం 3,497 కోట్ల రూపాయలతో మన ఊరు -మనబడి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన ఆచరణలో అది సంపూర్ణంగా అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి 2014 నుండి 2023 వరకు క్రమంగా బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. ప్రతి ఏటా తగ్గుతున్న ఈ కేటాయిం పుల వల్ల సర్కారు బడులు అంపశయ్యకు దగ్గరవుతున్నాయి. మొదటి బడ్జెట్లో విద్యారంగానికి 10.89 శాతం నిధులు కేటా యిస్తే 2023 రాష్ట్ర బడ్జెట్లో 6.57 శాతానికి నిధులు పడి పోయాయి. ఈ కేటాయిస్తున్న నిధులు కూడా కేవలం జీతాల కోసం తప్ప అభివద్ధికి ఏ మాత్రం సరిపోవడం లేదు. కనీసం 20 శాతం నిధులైన రాష్ట్రాల స్థాయిలో కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్న తెలంగాణలో మాత్రం ప్రతియేటా నిధులు తగ్గిస్తున్నారు పాలకులు.
విద్యా ప్రమాణాల్లో లోపం
విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచి చదవడం, రాయ డంలో సామర్థ్యం పెంచడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. విద్యాసామర్ధ్యాన్ని పెంచడానికి ఏటా ఒక కార్య క్రమం చేస్తుంది తప్ప వాటిని సమీక్ష చేయకుండానే విద్యా సంవ త్సరం ముగుస్తుంది. తెలంగాణలో సగానికి పైగా విద్యార్థులు ప్రయివేట్‌లో చదువుకుంటున్న వారికి కూడా తరగతి సామర్థ్యం అందడం లేదని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. విద్యాసామ ర్థ్యాలు అందించడానికి వ్యవస్థలు ఉన్న అందులో టీచర్లు తప్ప విద్యా శాఖలో వివిధ స్థాయి అధికారులకు పట్టింపులు, క్షేత్ర స్థాయిలో పర్యటనలు లేవు. క్షేత్రస్థాయికి వెళ్లిన మధ్యాహ్న భోజ నం, బాత్రూంలు, పుస్తకాల పంపిణీ పై దష్టి సారిస్తారు. కానీ విద్యాసామర్ధ్యాలు ఎంత సాధించారు? ఎలా సాధించాలి? అనే సమాచారం, పాఠశాలల సందర్శనలో అభ్యాసన ఫలితాలు గురించి పర్యవేక్షణకు సరైన సమా చారం ఉండదు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలా సామర్థ్యాలు పెంచాలో, సరైన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహించదు. ఉపాధ్యా యులకు శిక్షణా తరగతులు నిర్వహించిన వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించరు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్ధి అధ్యయన, అభ్యాసన సామర్థ్యం పెంచే కషి ఎలా అమలు అవుతుదనేది ప్రశ్నార్ధకం. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్క రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(నేడు అంతర్జాతీయ విద్యా దినోత్సవం)
టి. నాగరాజు
9490098292