తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 జిల్లా కమిటీ ఎన్నిక…

నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి సి అనుబంధం- 327 యూనియన్ సర్వసభ సమావేశం, భువనగిరి జిల్లా కేంద్రం, స్థానిక దీప్తి కన్వెన్షన్ లో, నిర్వహించారు. జిల్లా మరియు, డివిజన్ కమిటీ నీ ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వం యాజమాన్యం చొరవ  వారికి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఏపీ ఎస్ ఇ బి రూల్స్ తో పాటు గ్రేడ్ల వారీగా   వెంటనే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 2011 జూనియర్ లైన్మెన్ లా ఏరియర్స్ పై చర్చించి, తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిస్కౌంట్ కంపెనీ అధ్యక్షులు.. సురేష్ కుమార్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, తులసీదాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు శీను,… ఎన్నికైన కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా.. సుంకు సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, కుసంగి  శ్రీనివాసులు, కోశాధికారి.. ఇంజ మహేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్, బింగి నాగేష్ ఎర్ర బాలరాజు., డివిజన్ కార్యవర్గం అధ్యక్షులుగా.. గ్యార నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి రాపోలు రామచంద్రారెడ్డి, కోశాధికారి సాగిని రమేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కోల మహేష్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్, కలకొండ నరసింహులు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ మహేష్, రాములు, రవీందర్ రెడ్డి, హరి సింగ్, పాండు, మోత్కూరి ఐలయ్య, సెక్షన్ లీడర్స్ యూనియన్ సభ్యులు  పాల్గొన్నారు.