తెలంగాణ గళం..దళం మేమే : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నాడు..నేడు..ఏనాడైనా తెలంగాణ గళం, దళం మేమేననీ, పార్లమెంట్‌లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలంటే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఆ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 16,17 లోక్‌సభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు 4,754 ప్రశ్నలు అడిగితే..కాంగ్రెస్‌ 1271, బీజేపీ 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని తెలిపారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేసేది బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రమేనని పేర్కొన్నారు.