సహాయక చర్యలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం.

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా రైళ్ల ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలకైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైలు ప్రమాద ఘటనపై ఒడిశా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులను సంప్రదించింది తెలంగాణ ప్రభుత్వం. తగిన సహాయక చర్యలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలిపింది. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిలో ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.