కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది

– కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల
నవతెలంగాణ – సిద్దిపేట
కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని కేంద్ర పశుసంవర్ధక శాఖమంత్రి పురుషోత్తం రూపాల ఆరోపించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం కేంద్ర మంత్రి సిద్దిపేటలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి పర్యటించారు. మోడీ 9 సంవత్సరాల విజయాలను వివరిస్తూ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు రామచంద్రరావు రమాదేవి లకు బుక్ లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుంది అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కూడా మంజూరు చేస్తుందని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కూర పండరి, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డిల ఇంటికి వెళ్లి మోడీ పాలన విజయాలు వివరించారు. శివాజీ నగర్ లోని హనుమాన్ గుడి ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. స్థానిక విఏఆర్ గార్డెన్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో కలిసి లంచ్ బాక్స్ బైటక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి నాయకుడు చెంది సత్యనారాయణ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు. వచ్చి ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇంఛార్జి అంజన్ కుమార్, సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, రామచంద్రా రెడ్డి, రాంచందర్ రావు, ఉపేందర్ రావు, మల్లేశం, వెంకటేశం, శ్రీనివాస్, శంకర్, వేణుగోపాల్, అరుణ రెడ్డి, సుగుణ, శివకుమార్, యాదన్ రావు తదితరులు పాల్గొన్నారు.