తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

– కార్యాలయాల వద్ద మామిడి ఆకులతో ఏర్పాట్లు
– రెపరెపలాడిన జాతీయ జెండాలు
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలో అధికారులు, రాజకీయ నాయకులు జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. అంతకుముందు గడియారం సెంటర్లో ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ నాగార్జునసాగర్‌ దేవరకొండ నకిరేకల్‌, మిర్యాలగూడ, శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌ రవీంద్రకుమార్‌ నాయక్‌, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డి, అదన కలెక్టర్లు భాస్కరరావు, ఖుష్భుగుప్తా, ఎస్పీ కే.అపూర్వరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌లో చైర్మెన్‌ బండ నరేందర్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో ప్రేమ్‌ కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలో చైర్మెన్‌ మందడి సైదిరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కేవీ.రమణాచారి, వైస్‌ చైర్మెన్‌ అబ్బగోని రమేష్‌గౌడ్‌, వివిధ వార్డుల కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కే.అపూర్వరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌ మందడి నాగార్జునరెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిటి బండ కవిత, ఆర్‌ఐ గౌస్‌ బాబా తదితరులు పాల్గొన్నారు. వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రౌతు గోపి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు లక్ష్మీ నరసయ్య, లచ్చిరెడ్డి, సందీప్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో సీఐ నాగ దుర్గ ప్రసాద్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాజశేఖర్‌రెడ్డి, సైదులు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో భవనంలో ఎండిఓ శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనిమధ్య సుమన్‌ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో జెడిఎ సుచరిత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ హుస్సేన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ కొండలరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సూపరిండెంట్‌ లచ్చు నాయక్‌ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా గ్రంధాలయంలో చైర్మెన్‌ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్ర కర్మాగారంలో జైల్‌ సూపర్డెంట్‌ దేవుల నాయక్‌, జాతీయ జెండాను ఎగరవేశారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్‌ రెడ్డిజెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్‌, జిల్లా ఉపాధ్యక్షులు సాతీర్‌ యాదయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మేక శివ, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్‌ వీరానాయక్‌, జిల్లా నాయకులు బోధనం నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమం దేశ చరిత్రలో ఓ అజరామరాఘట్టం ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి
నార్కట్‌పల్లి : యావత్‌ తెలంగాణ సమాజం సాగించిన స్ఫూర్తిదాయక ఉద్యమం దేశ చరిత్రలో ఓ అజరామరాఘట్టం అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఉపకులపతి ఆచార్య గోపాల్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు జ్ఞానజ్యోతులై వెలుగు బాటలు పరవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఖేలో ఇండియాలో ప్రతిభను కనపరిచి విశ్వవిద్యాలయానికి రజీత పథకం సాధించిన సాయికి, యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సభ్యులు డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మురళి, శ్రీనివాస్‌ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య తుమ్మ కృష్ణారావు, ఓఎస్‌డి ఆచార్య అల్వాల రవి, పాలకమండలి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కొప్పుల అంజిరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ మిర్యాల రమేష్‌, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్‌ అరుణప్రియ, డాక్టర్‌ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ హరీష్‌ కుమార్‌, రామచంద్రుడు, డాక్టర్‌ మచ్చేందర్‌, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కేతపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పరిశ్రమలలో, పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలలో శుక్రవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ ఎన్‌.మధుసూదన్‌రెడ్డి, మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్‌, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో చైర్మన్‌ బోళ్ల వెంకట్‌రెడ్డి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అర్చన, పోలీస్‌ స్టేషన్లో ఎస్సై అనిల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, జెడ్పిటిసి బొప్పని స్వర్ణలత, ఆయా గ్రామాలలో ఈ పాఠశాలలో ప్రధానో ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచులు, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ చెన్నయ్య తహసీల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ అనిల్‌ కుమార్‌, ట్రాన్స్‌కో కార్యాలయంలో డీఈ వెంకట నరసయ్య, డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వెంకటగిరి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మెన్‌ తిరునగర్‌ భార్గవ్‌, మార్కెట్‌ కార్యాలయంలో కార్యదర్శి శ్రీధర్‌, పోలీస్‌ స్టేషన్లలో సిఐలు రాఘవేంద్ర, నరసింహారావు, సత్యనారాయణ, ఇరిగేషన్‌ కార్యాలయంలో డీఈ బుచ్చిబాబు, ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో కోర్టులలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. 21 రోజులు పాటు జరిగే దశాబ్ది ఉత్సవాల వివరాలను వివరించారు. కాగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. తోరణాలతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ పాలనలో సంక్షేమంలో స్వర్ణయుగం
ఆవిర్భావ దినోత్సవ వేడుకలో వీరేశం
నకిరేకల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలనలో సంక్షేమములో తెలంగాణ రాష్ట్రం స్వర్ణ యుగంగా వెలు గొందిందని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ పూజర్ల శంభయ్య, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద జాతీయ జెండాను మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌ దుర్గా రెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెల్ల లింగస్వామి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్‌, అవిశెట్టి శంకరయ్య, షీలా రాజయ్య ,బిజెపి నాయకులు చికిలమెట్ల అశోక్‌, కౌన్సిలర్లు కోఆప్షన్‌ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు. తాసిల్దార్‌ కార్యాలయం వద్ద తాసిల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఎంపీపీ కొలను సునీత వెంకటేష్‌, మార్కెట్‌ కమిటీ కార్యాలయం ముందు మార్కెట్‌ చైర్మన్‌ జడల అది మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
చండూర్‌ :స్థానిక మున్సిపల్‌ కేంద్రంలో మున్సిపల్‌ చైర్పర్సన్‌ తోకల చంద్రకళ వెంకన్న, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అర్చనరెడ్డి, జాతీయ జెండా ఎగరవేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి , మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి చలమల్ల కృష్ణారెడ్డి పిలుపు మేరకు చండూర్‌ మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వడ్డేపల్లి భాస్కర్‌ సాగర్‌ ఆధ్వర్యంలో చండూరు మున్సిపల్‌ కేంద్రంలో తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్‌ చలమల్ల కృష్ణారెడ్డి, వడ్డేపల్లి భాస్కర్‌ సాగర్‌, మల్దుర్కర్‌ దేవా, బొమ్మ కంటి శేఖర్‌, రహీం బాబా, సయ్యద్‌ జావిద్‌, వంగూరి యాదయ్య, మాస కృష్ణ, కురుపాటి గణేష్‌, చొప్పరి రాజు, మహమ్మద్‌ రఫీ, రాపోలు వెంకటేశం, శ్రీనివాస్‌ రెడ్డి, ఆవుల అశోక్‌, సోము లింగస్వామి, పాలకూరి నాగరాజు, మహమ్మద్‌ ఖలీల్‌, సమీర్‌, తదితరులు పాల్గొన్నారు.
గట్టుప్పల్లో…
గట్టుప్పల మండలం కమ్మగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎంపీటీసీ గొరిగే సత్తయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, వార్డు నెంబర్లు మాధవోని వీరాస్వామి, డానియల్‌, కట్ట సతీష్‌, అంగన్వాడి టీచర్‌ జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకే పాలన
దేవరకొండ : ప్రజల ఆకాంక్షల మేరకే పాలన కొనసాగిస్తూ అరవై ఏండ్ల అభివద్ధిని కేవలం తొమ్మిది ఏండ్లలో చేసి చూపించిన సీఎం కేసీఆర్‌ అని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందిస్తూ తెలంగాణా రాష్ట్రం యావత్‌ బరతదేశానికే ఆదర్శవంతంగా నిలిచింది అని ఆయన తెలిపారు.కోటి 40 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో గోపి రామ్‌, డి.ఎస్‌.పి నాగేశ్వరరావు,జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల అరుణ సురేష్‌ గౌడ్‌, పిఏ సి ఎస్‌ చైర్మన్‌ పల్లా ప్రవీణ్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌,వైస్‌ చైర్మన్‌ రహత్‌ అలీ,మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య ,సిఐలు ఎం. శంకర్‌ గౌడ్‌, పరుశురాం, ఎస్సై సతీష్‌ ,ముని కుంట్ల వెంకట్‌ రెడ్డి,వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ,జయప్రకాష్‌ నారాయణ, పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో గోపిరామ్‌ జెండాను ఆవిష్కరించారు. డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు, పోలీస్‌ స్టేషన్లో సీఐ శంకర్‌ గౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నరసింహ, కమిషనర్‌ వెంకటయ్య జండా ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నల్లగాసు జాన్‌ యాదవ్‌ ,ఎంపీడీవో శర్మ, తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ రాజు, జాతీయ జెండాను ఎగరవేశారు .సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహారెడ్డి, దేవరకొండ ఆర్టిసి డిపోలో డిపో మేనేజర్‌ రాజు ప్రేమ్‌ కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే నేనా వత్‌ బాలు నాయక్‌ ఆవిష్కరించారు. పి ఏ ఎస్‌ ఎస్‌ చైర్మన్‌ పల్లా ప్రవీణ్‌రెడ్డి జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు.
నల్లగొండ కలెక్టరేట్‌ : తిప్పర్తి మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణయ్య జాతీయజెండాను ఎగురవేశారు.స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీ, వైస్‌ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్‌ : సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని పెద్దగడియారం సెంటర్‌ అమరవీరుల స్తూపం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మెన్‌ డాక్టర్‌ బొమ్మరబోయిన కేశవులు జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుష్చార్ల సత్యనారాయణ, తాటి శ్రీనివాస్‌, తుటిపల్లి అంజి, మేకల పరమేష్‌, దుర్గాప్రసాద్‌, బచ్చగోని దేవేందర్‌, మాదగోని వంశీ, వెంకటేశ్వరులు, రాజేంద్ర ప్రసాద్‌, ఎండీ.అలీ, పెద్ది సైదులు తదితరులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : ఎన్నో పోరాటాల నడుమ ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆయా ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు . ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, పోలీస్‌ స్టేషన్‌ నందు సిఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మందడి మహేందర్‌రెడ్డి, స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ కుంభం శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో, రైతు వేదీక వద్ద రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, జెడ్పిటిసి సలహాదారుడు పసునూరి యుగంధర్‌రెడ్డి, ఎస్సై వీరబాబు, ఎంపీడీవో బాల్‌ రాజ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.