మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి జాతీయ జెండా పతాకవిష్కరణ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది వీరుల త్యాగఫలమే తెలంగాణ ఆవిర్భావం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,ఎంపీఓ సూర్యకాంత్,తాసిల్దార్ దశరథ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి,పంచాయతి సెక్రటరీ శ్రీనివాస్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.