నవతెలంగాణ-తాండూరు రూరల్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల ముందు మువ్వనెల జెండా రెపరెపలాడింది తాండూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ తారాసింగ్, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ అనిత రవీందర్ గౌడ్, మండల సమాఖ్య భవనం ఎదుట, ఏపీఎం ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట, ఏడిఏ, రుద్ర మూర్తి, ట్రెజరీ కార్యాలయం ఎదుట శ్రీధర్ రెడ్డి, ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట, సీడీపీఓ శ్రీలక్ష్మి, మండల విద్యా వనరుల కేంద్రం ముందు, మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, పశువర్ధక శాఖ కార్యాలయం ముందు, ఏడి ప్రభు రాజ్, ఎల్మకన్నా సహకార సంఘం ముందు, చైర్మెన్ రవీందర్ గౌడ్, గ్రామపంచాయతీలో, పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, ఏపీవో నరోత్తం రెడ్డి, ఏసీ మధుసూదన్ రెడ్డి, ఏటీవో, ఏవో రజిత, కోఆప్షన్ సంఘం సభ్యులు శంషుద్దీన్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.