ఆత్మీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానం

– థేమ్స్‌ తరహాలో మూసీ నది ప్రక్షాళన
– వెడ్డింగ్‌ ప్లానర్ల సమ్మేళనం ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
– దేశ, విదేశాల నుంచి 700 ప్రతినిధులు హాజరు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
ఆత్మీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్ల సమ్మేళనాన్ని హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జి బిషన్‌ సెంటర్‌లో మంత్రి ప్రారంభించారు. తెలం గాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండ స్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ 3వ ఎడిషన్‌, 3వ టీసీఈఐ ఎస్‌ఐడబ్ల్యు పీసీ గ్లోబల్‌ 2024 బియాండ్‌ ఇమాజినేషన్‌, 7వ టీసీ ఈఐ ఈవెంట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 వేడుకలు నిర్వ హిం చారు. ఈ వేడుకలు నేడు జరగనున్నాయి. ఈమెగా ఈవెంట్‌లో దేశ, విదేశాల నుంచి 700 మంది ప్రతిని ధు లు హాజరయ్యారు. లోకల్‌ ఎకానమీకి ఊతమివ్వడానికి ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’, ‘వెడ్‌ఇన్‌ తెలంగాణ’ను ప్రోత్స హిం చడం ఈ ఈవెంట్‌ లక్ష్యం. మంత్రి మాట్లాడుతూ.. ‘వివి ధ బడ్జెట్‌లకు అనుగుణంగా విభిన్న ఎంపికలను అం దిస్తుందన్నారు. తెలంగాణ మీ పెళ్లి కలను సాకారం చేసు కోవడానికి కావాల్సినవన్నీ అందిస్తుందని తెలిపారు. సౌత్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాం గ్రెస్‌ మూడో ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమన్నారు. నా ఉత్సుకతతో భారతదేశంలోని ఉత్తమ వివాహ గమ్య స్థా నాల కోసం గూగుల్‌ చేశానని’ అన్నారు. ఆ జాబితాలో తెలంగాణ లేదన్నారు. హైదరాబాదులో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నా తెలంగాణ బయట మాత్రం పెద్ద పెద్ద పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలిపారు. టెడ్డీ ఇమ్మా న్యు యేల్‌ (ఫిలిప్పీన్స్‌), మైఖేల్‌ రూయిజ్‌ (ఫిలిప్పీన్స్‌), బ్రయా న్‌ టాచీ – మెన్సన్‌ (ఘనా), రితురాజ్‌ ఖన్నా (న్యూఢిల్లీ, జయదీప్‌ మెహతా (అహ్మదాబాద్‌), మహావీర్‌ శర్మ (జై పూర్‌), గుంజన్‌ సింఘాల్‌ (జైపూర్‌) తదితరులు హాజ రయ్యారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరెక్టర్‌ కే నిఖి ల, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, జనరల్‌ సెక్రటరీ రవి బురా, బిజినెస్‌ హెడ్‌ హైటెక్స్‌ టీజీ శ్రీకాంత్‌ – బిజినెస్‌ హెడ్‌ హైటెక్స్‌, సాయి శ్రవణ్‌ మాదిరాజు, కన్వీనర్‌ ఎస్‌ఐడబ్ల్యుపీసీ గ్లోబల్‌ 2024 రామ్‌ కే ముప్పన, కన్వీనర్‌ టీసీఈఐ ఈవెంట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 హిరీష్‌ రెడ్డి, కో-కన్వీనర్‌ కుమార్‌ రాజా, కో-కన్వీనర్‌ సౌ రబ్‌ సురేఖ, కో-కన్వీనర్‌ సుధాకర్‌ యారబడి, టీసీఈఐ కో కన్వీనర్‌, ఎక్సలెన్సీ కౌన్సెల్‌ జనరల్‌. కింగ్డమ్‌ ఆఫ్‌ లెసోతో ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ సూరత్‌ సింగ్‌ మల్హోత్రా -హిస్‌, టీసీఈఐ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ జడేజా, టీసీఈఐ కోశాధికారి తౌఫిక్‌ మహమ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.